Swara Sudha-2024(TELUGU)

Swara Sudha

             To induce inner talent to extract the melodious voice from the land of Andra Pardesh And Telangana will take place with this magnificent platform. Through this prestigious program we lay red carpet for the breathing talents irrespective of their age, grade, qualification, gender and inter borders. Selected precise voices will be marked for felicitation along with award and rewards from our institution. Continuing that, winners and awardees can grab their opportunities as play back singers in silver screen ventures and also film productions from our institute.

      స్వర సుధ (తెలుగు గానాభిషేకం)
    


“పాడమని నన్నడగవలెనా పరవశించీ పాడనా, నేనే పరవశించీ పాడనా” అనే ఒకానొక పాట తెలుగు భాషాభిమనుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే అజరామర మధుర గీతం. పాడాలని అందరికీ కోరికే ! పాడటం రానివారు కూడా కూనిరాగాలు తీస్తూ లయబద్ధంగా తలలు ఊపుతూ తమ అభిరుచిని వ్యక్తం చేస్తూ ఉంటారు. సరస్వతీ దేవి కటాక్షం కోసం తమ జీవితాలనే ఫణంగా పెట్టేవారున్నారు. కఠోర పరిశ్రమతో సంగీత ఆలాపనలో శృతి లయలను ఒడిసిపట్టిన కొందరు కళాకారులకు వేదికలమీద అవకాశం మరియు తగిన ప్రోత్సాహం దొరక్క, తమలోని కళాతృష్ణ ఒక ఎడారిలోని కోయిలవలె ముగిసిపోతుంది.

ఔత్సాహికులకు ఒక అవకాశం కల్పించి, ప్రోత్సహించి వారిలోని ప్రతిభను గుర్తించి వారి సామర్థ్యాన్నిపెంపొందిచాడానికి పరంపర స్టూడియోస్ తెలుగువారి గానాభిలాష స్వప్నసాకారం కోసం "స్వర సుధ" అనే ఒక విన్నూత్న పాటల పోటీను ప్రారంభించడానికి మీ ముందుకు వస్తోంది.

పరంపర స్టూడియోస్ మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక చలన చిత్ర సంస్థ అయినప్పటికీ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించి,ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. మేము కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన “కర్ణాటక విద్యా స్ఫూర్తి” అను ఒక కార్యక్రమం మేము చేస్తున్న సమాజ సేవకు తార్కాణం. ఈ కార్యక్రమంలో మేము పాఠశాల విద్యార్థుల నుండి మొదలు పెట్టి పట్టభద్రులవరకు వ్యాస రచనా పోటీలు నిర్వహించి వారి ప్రతిభను గుర్తించి, ఎన్నికైన కొందరు అభ్యర్థులను పారితోషకం మరియు ప్రతిభా పురస్కారాలతో సన్మానించడమే కాకుండా అంతిమ పోటీ విజేతలను చలన చిత్ర రంగానికి పరిచయం చేయడం మాకు పరిపాటి.మేము నిర్వహించిన “కర్ణాటక స్వర సుగ్గి-2023” అనే పాటల పోటి, కర్ణాటక రాష్ట్రం లోని ప్రతి కన్నడిగునికి మా వేదిక అరంగేట్రం కావాలన్న మా బలమైన ఆకాంక్షనుండి ఉద్భవించి రూపుదిద్దుకొన్నదేనని మేము సగర్వంగా చెప్పగలం.

జానపద కళాకారులు ఎందరో సాంప్రదాయ సంగీతం నేర్చుకున్నవాళ్ళు కాదు. వారి కుల వృత్తుల జీవన శైలిలో భాగంగా తరతరాలుగా గ్రామ దేవతల జాతరలు, పండుగలు, పరసలు, ఉర్సుల లో వారు పాడే జానపద గేయాలు, పద్యాలు మనందరికీ సుపరిచేయమే. మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులకు కూడా పరంపర స్టూడియోస్ తమ ఈ “స్వర సుధ” కార్యక్రమం ద్వారా ఒక వేదిక అవకాశం కల్పించి వారి ప్రతిభను లోకానికి చాటి చెప్పెదమని మేము ఈ సందర్భంగా మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాం.

మా ఈ వేదిక ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన సామాజిక వర్గ కళాకారులకు ఒక సువర్ణావకాశమని ఘంటపాతంగా చెప్పగలం. ఇది లాభాపేక్షలేని ఒక సమాజ సేవ. ఈ స్వర సుధ పోటీలో జూనియర్ విభాగం నుండి 9 మంది అభ్యర్తులు మరియు సీనియర్ విభాగం నుండి 9 మంది అభ్యర్తులు ఆఖరి దశ (నాల్గవ రౌండ్) కు చేరుకొంటారు. మేము నిర్వహించే ఈ “స్వర సుధ” లో ప్రథమస్థాన విజేతకు మా సంస్థ ద్వారా సన్మానం, సంస్థ ద్వారా ప్రశంసాపత్ర ప్రదానం, ప్రోత్సాహక ధన బహుమతిలతో పాటుగా చలనచిత్రంలో పాడే అద్భుతావకాశం కల్పించి చిత్ర రంగానికి పరిచయం చేస్తామని మేము ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము. ద్వితీయ స్థాన విజేతకు ఒక ఆల్బమ్ (album) లో ఒక పాట పాడే అవకాశం మరియు తృతీయ స్థాన విజేతకు ఒక స్టూడియో సాంగ్ పాడే అవకాశం కల్పిస్తామని మేము ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము. ఈ ప్రచార పత్రం తో పాటుగా పంపబడిన మా సంస్థ గుర్తింపు పత్రాన్ని మీరు పాల్గొనబోయే ఈ పోటీలో తప్పనిసరిగా ఉపయోగించండి. మా సంస్థ కల్పిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకొనే తెలుగు కళాకారులందరికీ మా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ.
                                     రవీంద్రనాథ్ BR
                                       Managing Director